పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెడల రేపుదాని వేగము నరికట్టజాలను. అదే అభ్యాసమై నిలుచును. చేసినచెడుగునకో ఆలోచించిన చెడ్డ ఆలోచనకో నేడుపశ్చాత్తాపము పొందియున్న యెడల ఆగుణము రేపు మరి పుట్టదు. ఇట్లేమంచిగుణములును. చనిపోవుకాలమున తలపును నిట్లే. కడచినకాలము నెట్లుపయోగింతుమో యట్లే మరుజన్మములోని తలపులుండును.


(11)

కర్మవిధికి ఆక్షేపములు.

'అంతయును విధికి లోబడియున్నది. మనమేమిచేసిన నేమి?' అని చెప్పుట కర్మవిధి కాదు. కర్మవిధియని హిందూ శాస్త్రములందు చెప్పబడు సిద్ధాంతము వేరు. 'పురుష ప్రయత్న మావశ్యకము; అదే ముఖ్యము' అనుటయే కర్మ విధి. 'పురుషప్రయత్నమువలన ఫలములేదు.' అని చెప్పిన కర్మవిధికి శుద్ధవిరుద్ధము. నిన్న చేసిన చేతకు ఫలమును నే డనుభవించియే తీరవలెననుటవలన మనుష్యుని స్వాతంత్య్రమును తీసివేయుట కాదు. పురుషప్రయత్నపుశక్తికి హిందూ మతసిద్ధాంతము సంపూర్ణప్రాముఖ్యమును,సంపూర్ణ స్వాతంత్య్రమునుు మనుష్యున కిచ్చుచున్నది. 'అంతయు నీశ్వరుని పని. ఈశ్వరుని యనుమతిలేక యొక్కటియుగాదు' అనుట