పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడురహస్యమైన మనోవికారములుగూడ పరతత్త్వమను ఆకాశసముద్రమందలలను కలుగచేసి చరించును. అవి తమ ఫలములను కలిగించియే తీరును. ఆఫలములను తెచ్చుకొనిన జీవుడు వానిని మరల ననుభవించియే తీరవలెను. ఒకడు తక్కినజీవులకు కలిగించు సుఖమునకును దుఃఖమునకును తగిన బహుమతియో దండనయో పొందును. మన మాలోచించు నొక్కొక యాలోచనయు, చేయు నొక్కొకచేతయు వెంటనే మనలనే తాకుచుండును. ఒకచేతను చేయువాడే దానిఫల మును మొదట పొందును. ఇపుడు నేనొక మంచి యాలోచన నాలోచించినయెడల, లేదా మంచిపనిచేసినయెడల, దాని ననుసరించి ఆగుణము వెంటనే మంచిదగును. ఒకచెడుగు నాలోచించినను, ఒక చెడ్డయాలోచనకు మనస్సులో నెడ మిచ్చినను దానిననుసరించి యాత్మ కీడునుపొందును. కంసాలి బంగారునగనుచేసి రూపమునిచ్చునట్లు మనయాత్మను మనము కర్మమను సుత్తితో ప్రతిక్షణమును కొట్టుకొనుచునే యున్నాము. దేహమునువిడిచి మరియొక దేహమును పొందు నపుడు పూర్వముచేసిన కర్మములఫలమును, ఆలోచించిన యాలోచనఫలమును పొందియే యుందుము.

ఇప్పుడు నేను కోపమునడచికొన్న యెడల, రేపువచ్చు కోపము నడచుకొనుట సులభమగును. తాల్మియే స్వభావమై నిలుచును. ఇప్పుడు కామపరమగు నాలోచన కెడ మిచ్చిన