పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును జీవునికి ముఖ్యగుణములు. ఒకదేహములో చేరినకాలమున తాను చేసినచేత లాదేహమును విడువగనే యాత్మను విడిచిపోవు. మరుజన్మములో లెక్కయారంభించునపుడు వెనుక జన్మములోని కర్మముల యాదాయనష్టములతోనే యారం భింపవలెను. ఇదే కర్మవిధి.

లోకములో కనబడు సుఖదుఃఖములకును గుణభేదము లకును కారణమును విచారించి చెప్పునట్టి యేమతమునకైనను ఆక్షేపణలను చూపవచ్చును. ఎట్టి సమాధానమునుచూపినను గొరవులుండనే యుండును. బుద్ధిపరిచ్ఛేదమునకు సంపూర్ణ ముగ లోబడియుండదు. ఇదియే పీఠికలో చెప్పిన యీశ్వర రహస్యము కావున కంటికగపడుదేహములో కనబడనిఒకఆత్మ యున్నది. దానికి చావులేదని యొప్పుకొన్నయెడల, సర్వభౌతికశాస్త్రానుభవములకును పొందికగల సిద్ధాంతము హిందూమతమునందు చెప్పబడు నీకర్మవిధి యొక్కటే. వేరు సిద్ధాంతమేదైనను దీనికంటె నెక్కువ యాక్షేపణల కెడ మిచ్చును. పదార్థశాస్త్రములో జడపదార్థమునకును జడమైన శక్తిని నవినాశిత్వము చెప్పబడుచున్నది. అనగా ఒకపదార్థ మునకో, శక్తికో, దానిరూపమును మార్పవచ్చునేకాని అది లేకుండ చేయవీలులేదు. ఈసిద్ధాంతము ననుసరించియే భౌతికశాస్త్రమంతయును విస్తరింపబడుచున్నది. జడపదార్థ ముల అవినాశిత్వమును చేతనమగు శక్తి ననుసంధించుటయే