పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానికి వేరుగ నవయవము గాని, కోశము గాని లేదు. 'ఈథరు' లేక 'ఆకాశ' మని భౌతిక శాస్త్రజ్ఞులు కల్పించు కొనిన కల్పనాపదార్థమువలె దీనికి తూకములేదు. నివాసము లేదు. పరిమాణము లేదు. మనుష్యునికి మాత్రమేకాక ఎల్ల ప్రాణులకును, లతా, గుల్మ, వృక్షములకును నాత్మయున్నది. దేహమనునది ఆత్మ యుండుటకు స్థలము. కావున దేహమును క్షేత్రమనియు, ఆత్మను క్షేత్రి యనియు, క్షేత్రమును చూచు వాడు క్షేత్రజ్ఞుడనియు, చెప్పుట గలదు.

మనుష్యుడో, జంతువో, స్థావరమో, మరణము నొందినప్పుడది దేహమునకు మట్టుకు సంభవించునది. దేహము పూడ్చబడును. కాల్చబడును. లేక ప్రాణుల కెరయగును. ఆత్మ చావదు. దానిని చంపుటకును వీలులేదు. జనులు చనిపోయినారని దుఃఖించుట మూఢత్వము. చినిగి పోయిన లేక అక్కరలేని వస్త్రమును తీసివైచి, మనుష్యుడు క్రొత్తవస్త్రమును ధరించినట్లు, ఆత్మ వేరుదేహములోనికి పోయి ప్రాతదేహమును విడిచిపెటును. ఇదియే సత్యము. దీనికి మన మేల దుఃఖపడవలెను?

శ్రీ భగవానువాచ:


అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం శ్చ భాషసే
గతాసూ నగతాసూం శ్చంనాను శోచన్తి పండితాః