పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దనమాకాలపు జనులకు గూడ నుండెను. విషయములందు బుద్ధిని ప్రవేశింపచేసి, విచారించి, యసత్యమును మోసమును గ్రహించి తొలగించుటకు ఆనాడవకాశము లేకపోలేదు. మతములను స్థాపించిన పెద్దలను ప్రత్యక్షముగ కన్నవారును, విన్నవారును ఆమతస్థాపకులు మంచియుద్దేశముతోనే ప్రవర్తించినారని నమ్మి యాపెద్దలను గౌరవించుటచేతనే నామతములు కొనియాడబడుచు వచ్చినవి. మోసముచేతను, జనుల తెలివితక్కువచేతను యవి యభివృద్ధి బొంది నిలబడిన వని యెంచుట కేవలము తప్పు.

ఏసంస్థయైనను కాలము గడచిన కొలదిని స్వార్థపరులగు కొందరకు వశమై వారి స్వార్థమునకు సాధనమగును. అట్లే మతసంస్థలును మతములును గూడ చెడిపోయియుండుట సత్యము. కాని తరువాతి కాలమున చెడియుండుట, పూర్వముండిన మహాత్ముల నవమానించుటకు కారణముగా గొనుట మంచిపని కాదు. మురికికాలువలోని నీళ్లను చూచి మేఘములలోని నీళ్లును నట్లే యుండుననవచ్చునా? మేఘములను వానినుండికలుగు వర్షమును నెట్లు గౌరవముతో చూడవలెనో యావిధముననే యాదిఋషులను వారు తెలిపిన ధర్మసూత్రములను గౌరవించి పఠింపవలెను. దొంగను చూచి పట్టుకొనుటకు నింటిలో శోధన చేయ