పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోచినవికూడ, తరువాత అర్థరహితములై కాన్పించును. మన స్సునకు గురియైనవిషయము ప్రకాశముపొంది ప్రజ్వలించును. ఆవిధమున భగవంతునిదయను పొంది యంతరాత్మనుండి కని యానందించు విషయము నితరులకు వ్యక్తము చేయుటకు శక్తిలేకపోయి యుండవచ్చును. కాని యట్టి యనుగ్రహ మును, ఆనందమును సత్యములే.

(7)

శాస్త్రమును పఠించు క్రమము

ఏమతమునై నను సంప్రదాయమునై నను సరిగ తెలిసి కొనుటకు ద్వేషము, తిరస్కారము కల బుద్ధితో ప్రవర్తింప కూడదు. ఒకవిషయమును ద్వేషించిన నావిషయతత్త్వము గోచరింపదు. "మోసగాండ్రయి మనలను వంచించుటయే వీరి యుద్దేశమై యున్నది. ఏదో లాభముకొరకసత్యమును, మోసమును చేర్చి మతముల నేర్పరిచి, స్మృతు లను పురాణములను పూర్వులు వ్రాసినా" రనిపఠింప తొడగితిమేని నొకటియు తెలియదు. ఇట్లెంచుట మూఢ త్వము. మన కిప్పుడున్న జ్ఞానమును, జాగ్రతయు, సందేహ భావమును నాకాలపు జనులకు నుండెను. వారంద రును మూఢులనియు, మిక్కిలి సులభముగ వలయందు చిక్కిపోయిరనియు నెంచుట తప్పు. మనకున్న బుద్ధి. చురుకు