పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కట్టలు మొదలైనవానిని కట్టుటకు నిపుణులగుచున్నారు. అదేవిధముగా దైవము. ధర్మము అనునవి పరిశోధనకులొంగ వను కారణమునుబట్టి వానినిగూర్చి విచారింపక విడిచిపెట్టుట సరికాదు. వేదము, ఉపనిషత్తులు, గీత మొదలైన గ్రంథము లందు చెప్పబడిన విషయముల మితి, ఆధారము, రూపము మొదలగువానిని నిరూపించి, నిశ్చయింప వీలులేకున్నను నవి చాలముఖ్యములైన విషయములు; జీవితమునకు మిగుల నావశ్యకములు.

గణితము, భౌతికశాస్త్రము, రసాయన శాస్త్రము మొదలైన విజ్ఞానశాస్త్రముల ప్రథమాధ్యాయములో నెట్టి స్పష్టములగు భావములు తెలుపబడియున్నవో యంత స్పష్టముగా గీతయందును, నుపనిషత్తులందును గూడ తెలుప బడియుండలేదని యివి యాధార రహితములగు గ్రంథము లని యెంచగూడదు. ఇంద్రియాతీతములగు అధ్యాత్మవిషయ ములను విచారించి, జ్ఞానమును సంపాదించుటకు మన తెలివి యు, బుద్ధియు మాత్రము చాలవు. వీనికి జోడుగ భక్తి, మనశ్శుద్ధి, తపస్సు, ధ్యానములును నావశ్యకములు. ధ్యాన మును, తపస్సును గలవారికీగ్రంథము దారి చూపించును.

కాయశుద్ధితోడను, మనశ్శుద్ధితోడను ధ్యానించి పరమాత్మను ప్రార్థించినయెడల, ప్రథమమున విపరీతముగను పరస్పరవిరోధములుగను, అర్థరహితములగు పదములుగను