పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి యొక గొప్పతత్త్వమును గమనింపక యెట్లుండవచ్చును? కావున నాపరవస్తువును గమనింపక విడుచుటకు వీలులేదు. చీకటిగదియందు ఫలానిదియున్నదని తెలియ వీలులేదుగదా! అయినను దానిలో నొక ముఖ్యమయిన వస్తువు రూఢిగా నున్నదని తెలిసియున్నయెడల నాచీకటిగదిని గమనింపక విడువవచ్చునా?

గణితశాస్త్రజ్ఞులను బ్రశ్నించినయెడల ననేకవిషయము లలో గణితపథకములను లెక్కవేసి చూపుటకు సాధ్యము కాదని చెప్పుదురు. అయినను ముఖ్యములగుననేకవిషయము లను గణితముచేయుచు వచ్చుచున్నారు. అట్టి గణితమునాధా రముగాగొని కట్టడములనుకట్టియు, యంత్రములను చేయుచు న్నారు. వృత్తముచుట్టుకొలతకును, దానిమధ్య రేఖకొలతకును గల పరస్పరసంబంధ మేమి? ఒక సమచతుష్కపు భుజమునకును దానికర్ణమునకునుగల పరస్పరసంబంధ మేమి? అనిననిట్టి సాధారణవిషయములను గూడ గణితముచేసి సంఖ్యారూప ముగ తెలియ జేయుటకును వీలులేదు. నాలుగునకు వర్గ మూలమురెండు, తొమ్మిదికి వర్గమూలము మూడు, అనిచెప్పి నట్లు, రెంటికివర్గమూల మేమనియడిగినయెడల దశాంశములలో నైనను, సాధారణ భిన్నములోనైనను సరిగా గణితముచేసి చెప్పవీలులేదు. అయినను నీతెలియరాని లెక్కలమేర నతిక్ర మించి గణితశాస్త్రజ్ఞులు కట్టడములు, పెద్దవంతెనలు, ఆన