పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వస్తువులు భౌతికశాస్త్రవిషయములు. వీనికి మించిన విషయ ముల నెట్లుకాననగును, ఎట్లుకాన్పింపనగును, అనునదే లోక మున ననేకదేశములలోనున్న మతములయాశయమును ప్రయ త్నమును నగుచున్నది. అందుచేతనే మతగ్రంథములందు చెప్ప బడు విషయములు భౌతికశాస్త్రములలో చెప్పబడు స్పష్ట ములైన హేతువులవలెను పరిశోధనలవలెను నుండవు. కేవలము ప్రత్యక్షప్రమాణముచేతనో, యుక్తిబుద్ధిచేతనో తెలియ వీలులేని యీవిషయమును పరిశోధన చేయుటకు భక్తి కావలెను, ధ్యానము కావలెను, శాంతి కావలెను, నియమము కావలెను, తపస్సుకావలెను, అనియిట్లు వేదమునందును, తక్కిన ధర్మసూత్రములందును చెప్పబడియున్నది. ప్రక్కనున్నయూరికి కాలినడకను పోయి చేరగలము. దూరముననున్న యూరికి బండియు నెద్దును కట్టుకొని చేరవచ్చును. చెట్టుపై కెక్కుట వేరు, నూతిలోనికి దిగుట వేరు. పుష్పమును చెవిలో పెట్టిన యెడల వాసన దెలియదు. అందమైనపటమును ముక్కులో నుంచిన అందము తెలియదు. ఇంద్రియములకు లోబడని యొకవస్తువును మనసులో కనబడ జేయుట ఇంద్రియాను భవముపై నిలిచిన పరిశోధనలమూలమునను ప్రమాణ ముల మూలమునను సాధ్యముకాని కార్యము. అందుచేత పారమార్థికవిషయములను పరిశోధించి చేయుటకు భక్తియు, నియమమును, మనశ్శుద్ధియు, ధ్యానమును, భగవద్వందన