పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(5)

విచారక్రమము.

విజ్ఞాన పరిశోధనమున అన్ని విషయములందునొక హద్దు కాన్పించును. ఏవిషయము నెత్తుకొని శోధించినను నొక మితికి మించి దానితత్త్వమును దెలియ సాధ్యముకాదు. త్రవ్వుచున్న నూతిలో బండ కనబడినయెడల త్రవ్వుటను నిలుపవలసివచ్చినట్లు, ఎట్టి పరిశోధనమందును, ఒక మితినిమీరి మనుష్యునిబుద్దికతీతమయిన విషయముపై పోజూలదు. ఆదియే పరిశోధనకు సరిహద్దు. వేదాంతమునందు మాత్రమే కాదు. పదార్థశాస్త్ర పరిశోధనమందును గణితశాస్త్రమందును ఈ హద్దు అక్కడక్కడ నేర్పడినది. మనము కనుగొనినదానికిని, కనుగొన వీలగుదానికిని పాలమీది మీగడకును పాలకును గల యంతరమున్నది. మీగడక్రిందనున్న పాలలో తెలియరాని రహస్యమున్నది. ఇట్లు సాధారణవ్యవచ్ఛేద, పరిచ్ఛేదశోధనల కగ్గముకాని రహస్యమును, వేదము ఉపనిషత్తులు గీత మొదలయిన గ్రంథములును, ధర్మసూత్రములును, ముని వరుల వచనములును, జీవనచరిత్రములును వివరించుచున్నవి. పంచేంద్రియములను మూలముగా గొని, పంచేంద్రియవిష యములమూలమున తెలిసికొనిన తత్త్వములనే ప్రమాణము గా చేసికొని, వాని ననుసరించి యూహచేసి తెలిసికొనదగిన