పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపూర్ణతత్త్వమును తనలో నడగింప సాధ్యముకాదు. ఎంత యడగింపనెంచినను, అది లోపల నిముడదు. ఒక రాతిపై నిలిచియున్నవాడు తాను దానిపై నిలిచియుండియే దానిని ఎత్తి వేయచాలడు. మహాబలవంతు డైనను నేది తాను నిలుచు కొనుటకాధారముగ నున్నదో దానిని తీసివేయ సాధ్యము కాదుగదా? దానిని విడిచి క్రిందికి దిగినవాడు దానిని తీయ జాలును. బండినిలాగు గుఱ్ఱమును బండిలో నెక్కించిన నది బండిని లాగకలదా? మనుష్యునిబుద్ధి పరతత్త్వమును విడిచి, ప్రత్యేకముగా నిలుచు స్వభావము కలది కాదు. కావున, నాపరతత్త్వమునే వేరుచేసి తాను ముందుకు పోజూలడు;. అనగా, దానిని తన జ్ఞానముయొక్క హద్దులో నిముడ్చ చాలడు. కడుపులోని జీర్ణకోశమెట్టి యాహారమునై నను జీర్ణము చేయగలదు. కాని, తన్నుదానే జీర్ణించుకొను స్వభా వము దానికి లేదు. ఒకసోలను తీసికొందము. దానిలో నెంత పట్టునో అంతయే యది గ్రహింపగలదు. ఒకు పామున కెంతటి ఘోరమైన యాకలివేసినను తనతోకనే తాను తిని వేయచాలదు. ఆవిధముగనే యంతటికిని కారణమైన పర తత్త్వము మానవుని బుద్ధియందడగి యుండదు.