పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేయవలెనా ? న్యాయమార్గము నవలంబింపవలెను; లేకున్న ధర్మాతిక్రమణము జరుగును. కాని, పాపము కలుగకుండ చంపుటెట్లు ? ఈప్రశ్న కుత్తరమే గీతలోని విషయము. విషయములతో నీకు సంగమువలదు. జీవితమున నీకుగల స్థానమునకు విధింపబడిన ధర్మము నాచరించుము. ప్రపంచమును శాంత్యానందములలో పరణమింపజేయువా డీశ్వరు డనియు, ప్రభువును నతని యాజ్ఞయుకూడ నతడే యనియు గ్రహించుకొనుము; భక్తితో నతని యైక్యము నొందుము; పిదప కర్తవ్యతాబుద్ధితో కర్మము నాచరింపుము. కామమోహములను, క్రోధద్వేషములను విడిచి నీపనిని చేయుము. అట్టి కర్మము నిన్ను బంధింపదు. నీకు యోగము కుదురును. తన్మూలమున నాత్మకు మోక్షము ప్రాప్తించును.


ఈ పవిత్రగ్రంథమున స్పష్టముగ బోధింపపడిన దిదియే. కాని, అవతారపురుషుని కర్మములన్నియు చిహ్న ప్రాయములు. కాబట్టి యీ బాహ్యయుద్ధమాంతర యుద్ధమునకు గురుతుగా గ్రహింప వచ్చును. కురుక్షేత్రయుద్ధ మాత్మయుద్ధము; ధార్తరాష్ఠ్రు లాత్మకు గల శత్రువులు; అర్జునుడు మోక్షమునకై పెనగు లాడుచున్న సాధకుని యాత్మ. శ్రీకృష్ణుడు కూటస్థబ్రహ్మము. ఈరీతిగా పురాతనకాలపు యుద్ధభూమిలో చేయబడిన యుపదేశము సనాతనోపదేశమగుచు కంటకావృతమై కష్టభూయిష్టమైన