పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్షణవికర్షణముల ురెండును నేకేశ్వరునిలక్షణములనిగ్రహించి, అవితనకు మార్గమునుచూపునుపదేశములుగ నెంచవలెనుకాని తన్ను బంధించుపాశములుగ తలపకూడదు. కష్టములమధ్య నాతడు శాంతి కధినాధుడైన ఈశ్వరునందు విశ్రాంతికొని ఫలమును కోరక కర్తవ్యతాబుద్ధితో తనధర్మములను సంపూర్ణముగ నిర్వహింపవలెను. అతనిహృదయము యజ్ఞ వేదిక: అతనియెడ తనకుగలప్రేమయాయజ్ఞకుండమున ప్రజ్వలించు జ్యోతి; తనశారీరక మానసికకర్మము లన్నియు నాహుతులు. ఆయాహుతులను వేల్చినపిదప నతనికి వానితో మరిపనిలేదు.


ఈబోధ హృదయమున నాటుకొనుటకో యనునట్లు యుద్ధభూమిలో వీరరాజకుమారుడైన నర్జునునకు తన యన్న రాజ్యాధికారము నిలుపవలసిన విధియై యుండెను; రాజ్యము నాక్రమించి దేశమును నాశనము చేయుచున్నవాని నంతము నొందింపవలెను. రాజకుమారుడును యోధుడును నైనందున దేశము శత్రుబాధలనుండి తప్పించి శాంతిధర్మములను పునః ప్రతిష్ఠింపవలెను. ఈయుద్ధము మరింతఘోరముగ కాన్పించుట కిరుపక్షములందును తన ఇష్టులును, సఖులును నిలిచియుండిరి. అతని హృదయము దుఃఖముతోను, వేదనతోను నిండి యున్నది. జరుగబోవునది శారీరకసంఘర్షణమేకాక ధర్మ సంఘర్షణముకూడను. ప్రేమగౌరవముల కాస్పదములైనవారి నాతడు చంపవలెనా ? బాంధవ్యబంధముల నాతడు త్రెంపి