పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లన్నియు నశించి, శాంతముగ నిరంతరధ్యానమగ్నులయిన యోగావస్థయను నున్నతపదమున చేర్చి, దేహమును మనస్సును జీవితమున యదృచ్ఛముగా సంభవించు సన్నివేశము లందు కర్మములను జేయునట్లు సాధకున కది యుపకరించును. అధ్యాత్మజీవనము చేయువాడు సన్న్యాసి కానక్కరలేదనియు, ప్రపంచకార్యములమధ్యనే యుండి సాయుజ్యము నొందవచ్చుననియు, సాయుజ్యమునొందుట కాటంకములు మనకు బయటగాక మనలోపలనే యున్నవనియు, ఇదియే భగవద్గీతలోని ప్రధాన బోధన


అది యోగశాస్త్రము. యోగ మనగా కూడిక. మనోవేగములన్నియు స్వాధీనము చేసుకొని భగవద్ధర్మము లోలీనమగుటయే యోగము. ఈయవస్థ నందుటకు శాంతి కావలెను. సమచిత్తముకావలెను. అందుమూలమున జీవాత్మ పరమాత్మతో చేరును. అప్పుడది సాధకులు కాని వారిని ముందుకును వెనుకకును నూగులాడించు సుఖదుఃఖములు, ఇచ్ఛా ద్వేషములు మొదలగు ద్వంద్వభావముల నాత్మలంట కుండ చేయును. మితత్వము గీతబోధించు పరమార్థము. మనుష్యునిసర్వస్వమును బ్రహ్మముతో సంపూర్ణముగ ననుసంధానమునొంది యుండవలెను. సాధకుడు దీనినే లక్ష్యము నందుంచుకొనవలెను. అత డాకర్షించుదానిచేత నాకర్షింప పడకూడదు. వికర్షించుదానిచేత వికర్షింప పడకూడదు. ఆక