పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై మన కధికారము లేదనియు, జయాపజయములురెండును నొక్కటే యనియు నది బోధించుచున్నది. మనదేహమును మనస్సును నాత్మను మనధర్మమును నిర్వహించుటకు సంపూర్ణముగా వినియోగింపవలె ననియు, యదృచ్ఛాకామసంతృప్తులము కాగూడదనియు మనకోరికలను మనయధీనములో నుంచుకొనవలెననియు నది మనలను హెచ్చరించు చున్నది. సత్యాగ్రహినైన నాకది నిరంతరమును క్రొత్త పాఠములను నేర్పుచున్నదని చెప్పగలను. నేను భ్రమకు లోనై యున్నానని యెవరైన నాతో చెప్పినయెడల ఈభ్రమనే నాపరమ నిధానముగా భద్రపరచుకొందునని వారికి బదులుచెప్పుదును.


విద్యార్థులు తమ ప్రాతఃకాలకృత్యములను గీతాపఠనముతో నారంభింపవలెనని నే నుపదేశించుచున్నాను. నాకు తులసీదాసు ప్రియుడు. నే నతని భక్తుడను. కష్టసంకులమైన ప్రపంచమునకు రామనామమను మంత్రమును ప్రసాదించిన యామహాత్ముని నేను పూజించుచున్నాను. కాని, నేడు మీకు తులసీదాసునిగురించి చెప్పుటకు రాలేదు; మీరు గీత నభ్యసింపవలసినదని చెప్పుటకు వచ్చినాను. దానిలోని దోషములను కనుగొనవలెనని విమర్శదృష్టితో దానిని మీరు చదువ కూడదు. దానిని భక్తితోను, శ్రద్ధతోను చదువవలెను. అట్లభ్యసించినయెడల నది మీకోరికలనన్నిటి నీడేర్పకలదు. ఆమధురామృతము నొకసారి రుచిచూచినయెడల, దినదిన

(గమనిక :ఈ పుటలో పైనున్న మొదటి వాక్యభాగముతో , వెనుకటి పుటలోనున్న వాక్యముతో అన్వయము కుదురుటలేదు.)