పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నణగియున్నది. ఇదిగాక గీతలో మూడు ప్రత్యేకస్థలములలో వివిధ మతబోధనలను విడిచి భగవంతునే శరణు చొరవలెనని యుద్బోధ చేయుచున్నది. ఇందువలన గీతలో సూక్ష్మార్థము లున్నవనియు నర్థబోధ చాల చిక్కులతో కూడియున్నదనియు చేయు నాక్షేపణ కేవలము నిరాధార మైనదని తెలియగలదు.


గీత విశ్వమాత. ఆమె యెవ్వరిని దూరముగ నుండు మనదు. కోరినవారి కాద్వారము బాగుగ తెరిచియేఉన్నది. గీతను మనసా నాశ్రయించిన వాని కాశాభంగ మనునది లేదు. అత డూహింపరాని శాశ్వతానందమును శాంతిని అనుభవించును. సందేహపరునకును జ్ఞానపాండిత్యము గలవానికిని నాశాంతియు, నాయానందమును గలుగవు. అనన్య చిత్తులై, శ్రద్ధాపూర్ణులై, వినయసంపన్ను లైనవారికే యవి యబ్బును. అట్టి శ్రద్ధాభక్తివినయములతో గీత నారాధించిన వాడెవ్వడు నెన్నడును విఫలమనోరథుడు కాలేదు.


మనవిద్యార్థులు సాధారణముగా స్వల్పవిషయముల చేతనే కలత నొందుదురు. పరీక్షలో కృతార్థత కలుగలేదను చిన్నవిషయమునే వారమితమైన నిరాశను పొందుదురు. కంటికపజయముగ తోచినదానిని లక్ష్యపెట్టక వారు ప్రయత్నమును విడనాడకుండవలెనని గీత వారికి ధర్మబోధ చేయు