పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమున కొన్ని భాగములనుమాత్రము విని తృప్తినొందువారి కొక సందేహము తోచవచ్చును. జీవాత్మయు, పరమాత్మయు వేరుకావు. రెండును ఒకటేఅను మతము సత్యమైనదయిన యెడల నింద్రియముల నడచుట మొదలయిన యీశ్రమతో గూడిన పద్ధతులెందుకు? తానే బ్రహ్మమని తెలిసినతోడనే చింతలేకయుండవచ్చునుగదా !

ఇది సత్యమేకాని, ఇది దృష్టిని పొరబెట్టునట్టి అసత్య భావము. దీనిని విడువవలెను. అద్వైతవేదాంతమున చెప్ప బడిన అవిద్య యట్టిసామాన్యమైన 'టాకీ' దృశ్యము కాదు. కన్ను, చెవి, ముక్కు, ఎల్లయింద్రియములు, అంతరంగమగు మనస్సు, బుద్ధి, - అన్నిటినావరించియున్న ఈ యవిద్యఅను నది, దేహమును, బుద్ధిని, ఆత్మను, ఆవరించి యన్నిటియందును కలిసినిలిచియున్నది.


ఇది యొకపక్షమునకుచెందిన భావనయని చెప్పిన మాత్రమున ముగిసిపోదు; శరీరము, మనస్సులోనున్న, యొక్కొక్క సూక్ష్మాణువును తాకి, మేల్కొల్పి మలినమును తొలగింపవలసినదిగానున్నది. దానికి నిష్ఠ, ఇంద్రియనిగ్రహము, నిస్సంగత్త్వము అన్నియు కావలెను. మాయనుండి దృష్టిని విడిపింపవలెనని సత్యమును తెలిసినంతమాత్రము, సరిపోదు. మాయనుండి తప్పుకొనవలెనని తెలియుట ఒకటి. తెలిసినపిదప తప్పుకొనుట మరియొకటి. నేను తెల్లవారు