పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనతనపనియందాసక్తిగల మనుష్యుడు సిద్ధినొందును. తనతనకార్యమునందాసక్తిగలవాడు సిద్ధిపొందుమార్గమెట్లుండునో వినుము. 18-45


యతః ప్రవృ త్తి ర్భూతానాం యేన సర్వ మిదంతతమ్
స్వకర్మణా త మభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః.


ప్రాణుల కెల్ల బుట్టుక దేనినుండికలుగునో యేపరమాత్మునినుండి సమస్తములు వ్యాపించియున్నవో, యట్టి పరమాత్మను పూజించుటవలన మనుష్యుడు సిద్ధిపొందును. 18-46


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్ఠితాత్
స్వభావనియతం కర్మకుర్వ న్నా౽౽ప్నోతి కిల్బిషం.


ఇతరులధర్మమును బాగుగ చేయుటకంటెను, గుణము తక్కువయైనదైనను తన ధర్మమును నిర్వర్తించుట శ్రేయస్కరము. తన స్వభావమువలన నేర్పడినపనిని చేసినయెడల నాపనిలో నుండు సహజమైన దోషము నెవ్వడును పొందడు. 18-47


సహజం కర్మ కౌంతేయ సదోష మపి న త్య జేత్
సర్వారంభా హి దోషేణధూమేనాగ్ని దివా౽౽వృతాః


తనతో బుట్టిన కర్మము దోషముతోగూడియున్నను దానిని విడువగూడదు, అగ్నిని పొగ యావరించినట్లు సమస్త కార్యములు దోషసంపర్కము కలిగియుండును. 18-48