పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అసక్త బుద్ధి స్సర్వత్ర జితాత్మా విగత స్పృహః
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసే నాధిగచ్ఛతి.


సర్వవిషయములయందునుమమకారము లేక తన్ను తా గెలచి, కామమును విడిచి నిలిచినయెడల నాత్యాగ దృష్టివలన కర్మలేని పరమసిద్ధిని పొందును. 18-49


లోకములోకనబడు దృశ్యముల వివిధవ్యత్యాసములకు వెనుక మరుగుపడి యడగియున్న పరతత్త్వమును చింతింపవలెను. పుట్టుక, చావు, వ్యక్తమును, అవ్యక్తము నెరుగదు. పిల్లలకు పగలును రాత్రియు నెట్లో లోకము వ్యక్తమగుటయు, నాశమును అట్లే. బ్రహ్మ కన్ను మూయుటయు తెరుచుట యునే నాశము సృష్టియు అగును. జ్ఞానోదయము నొందిన మనుష్యుని యింద్రియములకు గోచరమగు నెల్లవిషయములును మనస్సును భావములునుచేయు నెల్లపనులును, పరవస్తువు రూపములేయగును. అనేకకోట్ల దృశ్యములును ఒక్కటిగనేకనబడును. యోగమున కంతమిదే.


అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవ న్త్యహరాగమే
రాత్య్రాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞికే.


పగలయినంతనే యవ్యక్తమునుండి రూపములు బయలుదేరును. రాత్రిరాగానే యాయవ్యక్తమునందే యవి మరుగుపడును. 8-18