పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరువాతకాలముననుండిన కొన్ని సాంప్రదాయములు ఆకాలమున లేవనుదానిని మరచిపోగూడదు. జాతివ్యత్యాసములు విడిచి యంధరును నొకజాతిగా నుండవలెనను ఉద్యమమునకును, అస్పృశ్యతను రూపుమాపి హరిజనులను తక్కినవారితో సమానముగా చేయవలయునను ఉద్యమమునకును ఆధారముగా శ్లోకములను వ్రాసిచూపుటకై భగవద్గీత వ్రాయబడలేదు. అట్లాధారముగా వ్రాసిచెప్పిన గీతలో శ్లోకములు లేనేలేవనునది చాలవేలసంవత్సరములకుపూర్వము వ్రాయబడిన యొకగ్రంథమునుగూర్చి నిశ్చయమైన ఆక్షేపణ కాజాలదు.


అయినను ఇట్టిసమత్వములనుగూర్చిన యుద్దేశములకు కూడ కావలసినన్ని ప్రమాణములు గీతలో నున్నవనుదానిని గమనింపవలెను. ఎల్లజనసంఘములందును, పనులను చేయు విధము ముఖ్యమైన యంశము. ఇది జాతిక్రమముగ అనగా నాయాజాతి నాయాక్రమముండవచ్చును. ఆయా కుటుంబము లాయాపనుల కనియు నుండవచ్చును. లేదా పుట్టుకను లెక్కింపక వేరువిధముగా నుండవచ్చును. ఏమార్గము ననుసరించినను గీతవాక్యముల తత్త్వము తుదివరకు నన్వయించును. ఈపని శ్రేష్టమైనది, ఇదిమంచిది, దీనిని చేయుదును, నొక నియమితముగ నొక పనివలదుఅని యెవ్వరును చెప్పగూడదు. ఇది గీతోద్దేశము. సంఘజీవనమున కావశ్యకమైన పనులలో