పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకత్త్వమందు నెలకొనియున్నవాడై, యెల్లప్రాణుల యందునున్న, నన్ను తెలిసినవాడు ఏపని చేయబోయినను

యోగియగును. నామార్గమున నడచినవాడగును.

6-31


గీతలో మనోనిగ్రహమును గూర్చియు, జ్ఞానోదయమును గూర్చియు, చెప్పబడిన యుపదేశములు, వ్యర్ధముగనో, పుస్తకమునకు, భూషణముగనో లేక చదివి మననముచేసి కాలము గడుపుటకో చెప్పబడినవికావు. నిజముగ సాధారణ జనులు, పురుషులును, స్త్రీలును, దానిలో చెప్పినట్లు జీవితమును నడపవలెనను నుద్దేశముతో నుపదేశింపబడినవి. వేదాంతపాండిత్యమును చూపి, సంతోషపడుటకు వ్రాసినవి కావు. వయసు ముదిరిన వారికిని చిన్నవయసువారికిని లౌకిక విషయములలో తగులుకొన్నవారికిని, ఏదశయందున్నవారి కైనను, ఫలకారులుగ చేయబడిన యుపదేశములు ఎల్ల కాలములకును చెప్పబడినవి. ఒకప్రత్యేక సందర్భమునకు మాత్రము చెప్పిన యుపదేశములు కావు.


తక్కిన మతగ్రంథములవలె గీతయు శాశ్వతధర్మము నుపదేశించు ఒక గ్రంథమైనను దానిని వ్రాసినకాలమున ఎట్టి జీవితపరిస్థితుల నందరనుసరించి వచ్చిరో, యాకాలమున సంఘ సంప్రదాయక్రమమేమైయుండెనో, స్మరణయందుంచు కొన్నయెడల నుపదేశింపబడు సత్య తత్త్వమును గ్రహింప వచ్చును.