పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పలువిధములైన ప్రాణులు ఒక్కటే యాధారముపై నెలకొనియున్న వనుటను తెలిసినయెడల అప్పుడా జ్ఞానఫలముగ ఎల్లయెడల విస్తరించిన బ్రహ్మమును చూచును. 13-31


సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్ష తే
అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికం.


వేరుగనున్న యెల్లప్రాణులను వేరులేనట్టియు, ఒక్కటే వస్తువుగ చూచు జ్ఞానము సాత్త్విక జ్ఞానమనియు తెలియుము. 18-20


సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చా౽త్మ ని
ఈక్ష తే యోగయుక్తాత్మా సర్వత్రసమదర్శనః.


యోగమార్గమున నిలిచిన వాడెల్లెడల సమదృష్టి కలవాడై యెల్లప్రాణులందును తనప్రాణము చేరియుండుటను, తనలో నెల్లప్రాణులునుండుటయు చూచును. 6-29


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
త స్యాహం నప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి.


ఎవడు ఎల్లయెడల నన్నుచూచునో, ఎవడన్నిటిని నా యందే చూచునో, వానికినేను ఎప్పుడును లేకుండ నుండను. నాకును వాడొకప్పుడును లేకుండనుండడు. 6-30


సర్వభూతస్థితం యో మాం భజ త్యేకత్వ మాస్థితః
సర్వథా వర్తమానో ౽పి స యోగీ మయి వర్తతే.