పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనుచున్న యెడలఫలములేదనుట గీతలోనితుదియుపదేశము. ఎట్టిపాపియైయున్నను, భగవంతునిమనఃపూర్వకముగ శరణు జొచ్చినవాడు నాశము నొందడు. ఎంతటి జ్ఞానియై యున్నను అతనిని శరణుజొరకున్న తరించుటకు వీలులేదు.


క్లేశో౽ధికతర స్తేషా మవ్యక్తాసక్త చేతసామ్
అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే.


అవ్యక్తమున మనస్సు నిలిపినవారికి కష్ట మెక్కువ. దేహధారులకు అవ్యక్తోపాసన మిక్కిలి కష్టము. 12-5


యేతు సర్వాణి కర్మాణి మయిసన్న్యస్య మత్పరాః
అనన్యేనైవ యోగేన మాంధ్యాయన్త ఉపాసతే
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్
భవామి నచిరాత్పార్థ మయ్యావేశిత చేతసాం.


ఎల్లపనులను నాకు సమర్పించి మనస్సును నాయందే నిలిపి అనన్యమైన యోగముతో నన్ను ధ్యానించి నడచు వారును నాయందు చిత్తమునుంచువారునైన జనులను, మరణము, సంసారము అను సముద్రమునుండి వేగముగ విడిపింతును. 12-6, 7


మాం చ యో౽వ్యభిచారేణ భక్తియోగేన సేవతే
సగుణాన్సమతీ త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే.


చలింపని భక్తియోగముతో నన్నుపాసించువాడు,