పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నువిడిచి, సంగము లేక సమచిత్తముతో కర్మములను, చేయుటకు తోడుగ, కరుణామూర్తియగు నారాయణునికే మనము చేయుకర్మముల నెల్ల నర్పణముచేయుచునడుచుకొనవలెను. తుద కతనియనుగ్రహమే మనలను కాపాడును. మరియొకటి కాదు. అతనియనుగ్రహమున్న యింద్రియముల నడచి, నడుచుకొన వచ్చును. సమత్త్వమును, శాంతమును, మనస్సును నమర్చుకొన వీలగును. ఆశ, జయము, మైకము వీనినుండి మనలను కాపాడుటకు, భగవానునియనుగ్రహము లేకున్న వీలులేదు. అట్లయిన యేకర్మమును చేయజొచ్చినను ఈశ్వరు నుద్దేశించి యతని కర్పణముగ దానిని చేయవలెను.


ఇదియే భక్తిమార్గ మనునది. ఇది కర్మయోగ మని చెప్పబడుమార్గమునకు బదులుగచేకొనగూడిన యొక ప్రత్యేక మార్గము కాదు. కర్మయోగమున చెప్పబడిన మనోభావము లేనివాడు భక్తియోగముచేయచాలడు. ఈశ్వరస్మరణమును, భక్తియు లేనివాడు కర్మయోగమార్గము ననుసరించుటయు నరుదు. భక్తియోగమును, కర్మయోగమును ఒకదాని కొకటి సహాయకారులు. చదువునప్పుడు వ్యత్యాసము కనబడినను, సరిగ నభ్యసించినయెడల రెండునునొక్కటేయని తెలియును.


శ్రీమన్నా రాయణుని శరణుజొచ్చుటయే యెల్ల మార్గములకును గమ్యస్థానము. తక్కినమార్గములనుగూర్చి వివరించు