పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవరికిని తమతమ జన్మగుణము ననుసరించి శ్రద్ధ కలుగును. జీవుడు తాను చేకొనిన శ్రద్ధ కనురూపుడై యుండును. ఎవ డేవస్తువునందు శ్రద్ధగల్గునో వా డావస్తువువలె నగును.


డంబమునకు చేయబడు తపస్సును, ఆచారమును, ఫలము నీయవు. లాభముగోరి చేయబడునదియు నట్లే. 17-3


అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః
దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః.


కొందరు డంబమును అహంకారమును గలిగి, కామముచేతను చిత్తవికారముచేతను ప్రేరితులరై శాస్త్రములో నియమింపబడని ఘోరమైన తపస్సు చేయుచుందురు. 17-5


కర్శయన్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః
మాం చై వా న్తశ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్.


ఇట్లు బుద్ధిచెడినవారు తమ శరీరములోని భూతసమూహమును, నన్నును, హింసపెట్టుదురు. వీరసురబుద్ధి గలవారని తెలియుము. 17-6


తపస్సనునది మనోవాక్కాయములను మూడింటితో చేయబడినది. ఆర్జవము, శుచి, పెద్దలయెడ నడకువ, బ్రహ్మచర్యవ్రతము, భూతదయ, ఇవి దేహముతోచేయు తపస్సు; వాక్తపస్సనునది, సత్యము, ప్రీతి, హితమైనమాట, మంచి ధర్మగ్రంథములను చదువుట. మొదలగునవి. మనస్సును