పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సుడిగుండమునుండి తప్పించుకొను మార్గమేదనిన కర్మమునుగూర్చి పూర్వము చెప్పినదానిని జ్ఞాపకమునకు తెచ్చికొనుటయే. ఆత్మకు స్వతంత్రబుద్ధి యున్నది. కర్మము చేయుట కధికారమున్నది. దానినుపయోగించి కర్మబంధము నుండి తప్పుకొను మార్గమును, స్వభావగుణముల నడచుటకు తగిన యుపాసన, ఆచారము, ఆహారము వీనిని నిత్యనియమముగ నుంచుకొనవలెను. ఇట్లుచేసినయెడల మేలును పొందుదుము. పూర్వకర్మఫలమునకును నీజన్మమున చేయుకర్మమునకును బీజాంకురసంబంధ మున్నది. చెట్టునుండి బీజము కలుగును. బీజమునుండి చెట్టు మొలచును. కారణము కార్యమగును, కార్యము కారణ మగును. ఇదే ప్రతి దినాచారమునకును, గుణమునకును పరస్పరసంబంధము. ఒకదానికి మరి యొకటి కారణ మగును.


త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా
సాత్త్వికీ రాజసీచైవ తామసీ చేతి తాం శృణు.


ఒడలు దాల్చిన యాత్మకు స్వభావగుణమైన శ్రద్ధ మూడువిధములుగ కనబడును. సాత్త్వికము, రాజసము, తామసము అని. 17-2


సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత
శ్రద్ధామయో౽యం పురుషో యో యచ్ఛ్రద్ధ స్స ఏవసః