పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాంతముగ నుంచుట, శుద్ధమైన తలపులను తలచుట, భోగములనుగూర్చిన తలపులను విడచుట ఇవి మనస్తపస్సగును. ఇట్టి పలువిధములైన తపస్సులను లాభమును కోరక యితరుల గౌరవమును సంపాదించు నుద్దేశములేక తపోమహత్త్వమును గోరియే చేయవలెను. ఇతరులకు హింసనుచేయుటకు గాని, పిడివాదముచేయు బుద్ధితోగాని తపస్సుచేయుట కేవలము తప్పు.


దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం
బ్రహ్మచర్య మహింసా చ శారీరం తపఉచ్య తే.


దేవుడు, ద్విజులు, గురువులు, ప్రాజ్ఞులు వీరిని పూజించుట, శౌచము, తిన్ననినడక, బ్రహ్మచర్యము, అహింస, ఇవి శరీరమునకు సంబంధించిన తపస్సు. 17-14


అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యా యాభ్యాసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే.


ఇతరుల మనస్సును కలతపరుప నట్టియు, సత్యము ప్రియమునైనట్టియు, హితకరమైనట్టియు మాటను మాట్లాడుటయు, శాస్త్రమును చదువుటయు, ఇవి వాక్కుతో చేయబడు తపస్సు. 17-15


మనఃప్రసాద స్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః
భావసంశుద్ధి రిత్యేత త్తపో మానస ముచ్య తే.