పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50 సాహిత్య మీమాంస

నెలకొని యుందురు, రక్తపాతమును పృథులముగా నొనర్చువారే గౌరవమునకు పాత్రు లగుదురు. మన కాదర్శరూపులు వారే అగుటవల్ల మనముకూడా వారి ననుకరింపవలయునను ఔత్సుక్యము జనించి, కలహము, రక్తపాతము, విజయము అను మార్గత్రయమందే పౌరుష మున్నదనే భావన కలుగును, రక్తపాతమున వెగటు పోయి అనురక్తి జనించును. "కొత్త వింత, పాత రోత" అను సామెతప్రకారము ఈ మార్గమే గౌరవనీయ మని యెంచబడును. ప్రాచి క్రమముగా ప్రతీచి అగును.

ఇంకొక విశేషము - పాశ్చాత్యులయం దిప్పుడిప్పుడు రక్తానురక్తి శిథిలమగుచున్నది. - ప్రతీచి ప్రాచ్యాదర్శముల గౌరవించుచున్నప్పుడు మనవారియందలి రుచివిప్లవము విపరీతముగానే కనబడు చున్నది.

ఆర్యసాహిత్యమందలి వియోగాంతము రక్తపాతశూన్యము

ఆర్యసాహిత్యమున వియోగాంతఘటనాసంచయము లేకపోలేదు, కాని అందు రక్త పాతము శూన్యము. యూరపునందలి వియోగాంతనాటకముల రెండవ ప్రధానగుణమైన కరుణారసము ఆర్యసాహిత్యమున గానవచ్చు చున్నద్ఫి. షేక్స్‌పియరు రచించిన డెస్‌డెమోనా పాత్రము చూచి ఎంత వ్యథ చెందెదమో సీత, దమయంతి, ద్రౌపది, శకుంతల, మహాశ్వేత మొదలగు పాత్రముల చూచిన అంతకాన్న నెక్కువ వ్యధకు భాజనుల మగుదుము; ఐనను డెస్‌డెమోనా