పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49. రక్తపాతము

ముగా తగ్గు చున్నది. ఆంగ్లసాహిత్యమే ఉత్కృష్టసాహిత్యమనియు, ఆంగ్లకవులే ఉత్తమకవు లనియు, వియోగాంత నాటకములే ప్రశంసాహన్‌ములు, పఠనీయగ్రంథము లనీ దృఢవిశ్వాసము మనవారి మానసముల నాటుకొను చున్నది.

మనవా రిప్పుడు తరుచుగా షేక్స్‌పియరు రచించిన ఉత్తమవియోగాంతనాటక చతుష్టయము నాడుచున్నారు. కవులు మన దేశభాషలలో వియోంతనాటకములను వ్రాయ మొదలుపెట్టుచున్నారు, అస్త్రశస్త్రములను ఇతర ప్రాణాపాయసాధనములను రంగస్థలమున ఝళిపించి అనాథలను అమాయికులను నరుకుచు రక్తపాతమునకు ప్రచారము కల్పించుటచే సభ్యత అని యెంచు చున్నారు. అందుచే రంగస్థలములయందు రక్తపిసాస నానాటికి హెచ్చు చున్నది. ఇది ఇంతతో నాగునో, లేక బయటికికూడ దుముకునో విచారణీయము.

అ ట్లగుటయే సంభవమని స్ఫురించుచున్నది. ఆంగ్ల సాహిత్యమున ఏనాటకము గాని, నవలగాని, కావ్యము గాని కథ గాని చదువగా చదువగా వియోగాంతకార్యములు మనచిత్తముల నాకర్షించును. ప్రతికల్పనమునా రక్తము ప్రవహించు చుండుటయే యుక్తమని తోచుచుండును. ఎప్పుడూ చిత్త మక్కడే జొత్తిలి యుండడముచేత రక్త మన్న రోత పోవును, పాపభీతు తొలగును; బలవీరులే మనమానసముల