పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

213 దేవత్వము

ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడై చిరస్మరణీయు డయ్యెను. ఆత్మగౌరవాహంకారములు ప్రబలుటచేతనే కదా యయాతి స్వర్గభ్రష్టుడై మర్త్యలోకమున కొంతకాలము తపస్సుచేసెను. యుధిష్ఠిరు డెంతో తపస్సుచేసి భీష్మునిచేత ధర్మతత్వ ముపదేశింపబడినా అహమిక పూర్తిగా నశించకపోవడముచేతనే శ్రీకృష్ణుని కటువాక్యములు వినవలసివచ్చెను. ధర్మరాజుచరితమంతా ఉగ్రమైన ధర్మతపశ్చరణమందు లగ్నమైనట్లు తోచును. అతడు సంతతము బ్రాహ్మణుల సంసర్గముచేతా ఋషుల ఉపదేశముల మూలానా చిత్తశాంతి చిత్తశుద్ధిన్నీ సమకూర్చుకొనడానికి యత్నిస్తూ ఉండెను. తప: ప్రభావము వల్లనే ధర్మవ్యాధుడు దివ్యత్వము పొందెనని మహాభారమందుంది. ఆతడు వృద్ధులగుతలిదండ్రుల దేవతలవలె పూజిస్తూ ప్రేమవ్రతము నాచరించెను, కావున కౌశికునకు దేవతాదర్శ రూపమగు పితృభక్తి మచ్చు చూపగల్గెను. ఆవృద్ధదంపతులు ప్రేమకున్నూ భక్తికిన్నీ నిధానములై ప్రత్యక్షదేవత లయినారు. ధర్మవ్యాధుని చూచినవెంటనే కౌశికునికి కూడా తన పితరుల పూజించు నిచ్ఛ వొడమింది. సతీమతల్లియైన బ్రాహ్మణుని భార్య యిందుకే కౌశికుని అక్కడికి పంపింది. ఆమె ఏకాంతచిత్తముతో సతీవ్రత మాచరిస్తూ ఉన్న సాధ్వీమణి. కుంతి గాంధారి మొదలగు పతివ్రత లిట్టి తపస్వినులే.

ఆర్యసాహిత్యమున చిత్రింపబడిన మానవపాత్రములు సామాన్యములు కావు. అందరూ దేవత్వము లభించడమునకై