పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212 సాహిత్య మీమాంస

చ్ఛాదనములను తొలగించినతోడనే దేవతారూపములు వ్యక్తములగుననిన్నీ మనఋషులు చెప్పినారు. మానవదేహము లందాత్మ రూపమున పరమేశ్వరుడు వర్తిస్తూన్నాడు, మోహావరణము తొలగించగానే తద్దివ్యజ్యోతి ప్రకాశించును. మనుష్యులు దేవత్వమును పొందగలరనుటకు ఋషులు ప్రమాణముల నిచ్చినారు, తపోబలమున ఎట్టి అసాధ్యమైన పనియైనా సాధ్యమగును. సామాన్యులందు దైవశక్తి ఆవిర్భవించు మార్గములను సూచించడానికే కవులు మనసాహిత్యమున ఋషిచరితములను జొన్పినారు. ఆచరితములు చదివితే మనుష్యులకు దేవత్వము సాధ్యాతీతము కాదని స్పష్టపడును. రామాయణమున భారతమునా దివ్యశక్తుల నార్జించిన ఋషులనేకు లీయభిప్రాయమును దృఢపరుస్తున్నారు.

మానవ చరితము

దేవతలయొక్కయు ఋషులయొక్కయు చరితములే కాక అనేకమంది భక్తులు సాధకులు మొదలగువాళ్ల చరిత్రములూ మనసాహిత్యమున కలవు. ఒకవంక దేవతలమహిమావంతములు ఉన్నతములగు నాదర్శములు, వేరొకవంక తప:ప్రభావమున దివ్యశక్తుల నార్జించి దేవత్వసిద్ధి గాంచిన ఋషుల చరితములు కలవు, ఇంకొకవంక తపశ్చరణ మొనర్చుచుండు మానవులు కానవత్తురు. అరిషడ్వర్గమును వశపరచుకొని చిత్తమును తపముచే నాయత్తపరుప సంయమిత్వము సిద్ధించును. ఇట్టి తపోబలమువల్లనే ధృవుడు తరించెను. దానిచేతనే