పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196 సాహిత్య మీమాంస

తనకు బద్ధులుగా చేసుకొన్నంతమాత్రాన గృహస్థు దేవత్వమును, సాధించగలడా? కల్ల. భార్యాపుత్రుల తగులాటము కేవల పశ్వంశ, దీనిని తెంచినగాని దేవత్వలబ్ధి కానేరదు. హిందువుల గాహన్‌స్థ్య మత్యంత కఠినము, ఇది కేవల మైహిక సుఖసాధనమే కాదు, పరమం దక్షయస్వర్గసౌఖ్య మబ్బుటకు కూడా గాహన్‌స్థ్యధర్మాచరణ ముపయోగపడును. ఇందు సంయమ మత్యావశ్యకము, కావున ఇంద్రియదౌర్బల్యముకల వా రీఆశ్రమనియమపాలన మాచరింపలేరు. స్త్రీసాంగత్యమున ప్రాబల్యము నొందిన రిపుషడ్వర్గమును సద మదము చేయవలెను. ఇందు దాంతి చేకూరినపిదప గురుజనమును సేవిస్తూ తపశ్చరణ మాచరించవలెను. "తలిదండ్రులు, తదితర గురుజనమూ జీవించి యున్న న్నాళ్ళు గృహస్థు ధర్మకర్మాచరణమున నెట్టిస్వాతంత్ర్యమూ వహింపరాద"ని మనువు శాసించెను. వారికి శుశ్రూషచేస్తూండే టప్పుడువిఘ్నము లేవీ రాకుండా చూచుకొని, పారలౌకికకర్మ నా చరింపవలసినప్పుడు వారికి నివేదించితీరవలయును. పితృసేవ, ఐహిక పారమార్థిక ధర్మా చరణమూ అను మూడుపనులు చేయుటవల్ల పురుషజన్మ సార్థక మవును, ఇదే పరమధర్మము, తక్కినవన్నీ ఉపధర్మములు.

ఇట్టి కఠినతపశ్చరణమువల్ల దేవత్వము సాధించవలెను, అట్టి సాధనలో పత్ని పతికి తగినసాయము చేయును; అట్లు చేసేటప్పుడు సంతానముపై మోహము విడిచి, స్వార్థము త్యజించి, భక్తికి స్నేహమును, దేవతలకుసంసారాసక్తియున్నూ