పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

195 దేవత్వము

ధర్మక్షేత్రమని చెప్పియుంటిమి, అచ్చటనే దేవత్వము ప్రాప్తించుటకు వీలుంది. హిందూకుటంబములయందు పతిపత్నులు మాత్రమే ఉండక వారి ఆత్మీయులు, కుటుంబము, పరిజనము, గురుజనమూ కాక ఇరుగుపొరుగువారు, ఆశ్రితులు, అతిథులు, పశుపక్ష్యాదికమున్నూ ఆకుటుంబము నాశ్రయించుకొని యుండును - వీరందరూ గృహస్వామి ప్రేమకు పాత్రులు కావున అందరికీ అతని ప్రేమ పంచబడును. ఐరోపీయ కుటుంబముల కింత పరివార ముండదు - హిందూగృహస్థు తనప్రాపు గొన్నవారియెడ నిష్పక్షపాతబుద్ధితో వర్తించవలెను. ఒకదెస దారపుత్రాదుల ప్రేమరజ్జువుతో బంధించి ఇంకొకదెస వృద్ధులౌ జననీజనకుల సుఖపెట్టవలయును. ఇం దెవరి నుపేక్షించినా మూర్ఖు డనిపించుకొనును, అట్టివాని నందరు నేవగింతురు. స్నేహ మధోగామి, భక్తి ఊర్ధ్వగామి. పైకెగయు టెంత కష్టమో క్రిందికిజారు టంతసులభము. హిందూగృహ స్థెప్పుడూ పైకెగుర జూస్తూండవలయును. ఐరోపీయులలో నిట్లుకాదు. తలిదండ్రులు పుత్రులతో కలియరు, వీరి గాహన్‌స్థ్యముతో వారి కెట్టిసంబంధ ముండదు. ఇద్దరి కుటుంబములూ వేరుగా నుండును. గృహిణి పతిమరణానంతరము ఆ సంతానము వీడి యింకొకని చెట్టబట్టవచ్చును, కావున ఎవరిసంతానము వారిదే. హిందూగృహస్థునివలె ఐరోపీయుడు ఇంటనున్నవారినెల్ల సమదృష్టితో చూడనక్కరలేదు.

భార్యాపుత్రాదులను మాత్రమే ప్రేమశృంఖలమున