పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194 సాహిత్య మీమాంస

డగు విరాట్పురుషుడు ఒకపాదమున సంసారలిప్తు డాయెనని ఋగ్వేదమున నుంది. మహేశ్వరుడు సంసారియూ సన్యాసియు నై వెలయుచున్నాడు. దుర్గ సంసారిణి, త్రైలోక్యతారిణి ప్రేయిమయియు నైన వైష్ణవి. ఈ రెండవమూర్తియే మహిషాసురమర్దని యని పిలువబడుచున్నది. మహిషాసురుడు సగము మానవుడు సగము పశువు; దుర్గాదేవి వాని పశుత్వము బాపెను. దేవబలము పశుబలమును నిర్జింపగలదు - పశుబలము నెదుట భగవతి అపరాజిత యగును. జగద్రక్షిణివైష్ణవి యైన శక్తి ఈ ప్రపంచమందలి పాపమును తొలగించును. శివప్రేరణమున నామె ఈ సంసారమున తగులువడనెంచి మహాశక్తి రూపమున నవతరించింది - అందుచేతనే -

                    "యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
                      సర్వభూతములందు శక్తిరూపంబున నిలిచియుండును దేవి నీలవర్ణ"

అని ఋషివాక్యము. ఈశక్తియందు నిరతుడై మహాదేవుడు నిర్లిప్తుడగు సంసారి అనిపించుకొనెను. అతని సంసృతి నిష్కామపవిత్రక్షేత్రము. ఇట్టి విశ్వపతి హిందువుల కాదర్శ రూపుడగు పతి. అనగా ఆదర్శరూపుడగు హిందువుడు గృహస్థాశ్రమము ప్రవేశించి ధర్మాచరణమున దేవత్వము సాధింపవలెను. ఈధర్మములు శిష్టాచారములని విశదముగా వర్ణింపబడ్డవి - 118 వ పేజి చూడండి -

6. గురుజన సేవ - (శుశ్రూష)

దేవత్వ మెట్లు లాభకరము? హిందూగృహము గొప్ప