పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

193 దేవత్వము

గుణస్ఫూర్తి వర్ధిల్లుచుండును. ధర్మానుష్ఠాన మెప్పుడూ నిరర్థకము కాజాలదు, దానిమూలాన యింటివారందరూ భగవద్భక్తు లగుదురు. మహత్కార్యముల ఫలము వాటి నొనరించిన వారికే కాక ఇతరులకు కూడా చెందుచుండును. గృహస్థులగు దంపతుల ప్రేమప్రవాహము సంసారసాగరమున పడును. భగీరథుడు శివుని జటాజూటమునుండి గంగను భూలోకమునకు తేగా గంగా యమునలు కలిసి కపిలాశ్రమ మందలి ఋషులచే పూతములై సగరకుమారుల నుద్ధరించి సాగరమున బడెను. సంసారమున పుట్టిన పతిపత్నుల ప్రేమ పవిత్రమై విశ్వరూపుడగు భగవంతునియందు చొచ్చి సర్వప్రాణుల యందున్నూ సంక్రమించును. దీనినే "మైత్రి" అంటాము. యాజ్ఞవల్క్యమహర్షి తన సహధర్మచారిణియైన మైత్రేయ ప్రేమను భక్తి మార్గమునుంచి తప్పించి మైత్రిగా పరిణమింప జేసెను. ఆప్రేమ ఋషి పూతము, యాజ్ఞవల్క్యుడు సంసారమందుండి తాను ఋషియగుటే కాక తన భార్యకు కూడా ఋషిత్వము ప్రాప్తింపజేసెను.

దేవతల సంసారము

హిందూ దేవతలకు కూడా సంసారబంధము కల్పించబడినది. ఈ ప్రపంచమే వారిల్లు, ఇందలి కృత్యములే వారి గృహధర్మములు, పరబ్రహ్మ మొకటైనా ఈశ్వరుడు ఈశ్వరి అని రెండువ్యక్తు లయ్యెను. సహజముగా నిర్గుణమైన పదార్థము సగుణమైనది; నిర్లిప్తుడు సంసారలిప్తు డయ్యెను - త్రిపాదు