పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192 సాహిత్య మీమాంస

5. ధర్మాశ్రయము

దోషనివారణ మెంత ఆవశ్యకమో భక్తి ప్రేమపోషణమంత ఆవశ్యకము, కావున ఆదర్శరూపుడగుపతి తన భార్యను ధర్మానుష్ఠానమున సహ కారిణిగా నొనర్చుకొనును. బ్రహ్మయజ్ఞమునందు తప్ప ఇతర యజ్ఞములందు భార్యాసహాయ మావశ్యకము - పితృ, దేవ, భూత, మనుష్యయజ్ఞములలో సర్వమూ నిర్వహించేది సతి. అతిథిసేవ అన్నదానము లామె లేకుంటే జరుగనే జరుగవు.

ఈ యజ్ఞములవల్ల పురుషుని భక్తిప్రవృత్తులే చరితార్థము లగునా? స్త్రీచిత్తమున వీటి ప్రసారమే లేదా? హిందువుల గృహములే ధర్మక్షేత్రములు, అందు పతిపత్నులే కాక ఇతరులున్నూ పాల్గొందురు - కుటుంబమంతా ధర్మాసక్తమగును. ఇట్టి ధర్మ ప్రభావము లేని గృహములు హిందూగృహము లనిపించుకొనవు. మనయిళ్లలో నిత్య నైమిత్తిక మాసిక వాత్సరిక ధర్మానుష్ఠానము జరుగుచుండుటచేతనే భక్తి, శ్రద్ధ, ప్రేమ, క్షాంతి మొదలగు ఉత్కృష్టప్రవృత్తులు స్ఫూర్తిచెందును. ధర్మ మెంతశ్రద్ధతో ఆచరిస్తే అంతత్వరలో