పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

187 దేవత్వము

స్తూఉంటారు. సృష్టికర్త ప్రేమమయుడూ ప్రేమాధారుడని చెప్పనేచెప్పితిమి. ఆప్రేమవల్లనే నారీమణుల హృదయమును తనవైపు లాగుకొని అత్యాదరముతో నాప్రేమను వృద్ధిచేయును. ప్రేమప్రభావమున నారీమణులు తమ్ముతాము మరచి ప్రేమించువారియందు మనస్సు లగ్నముచేసి ఏకనిష్ఠతో వారికి తోడునీడలై వర్తింతురు. పత్నియెడ అనూనాదరము, ప్రేమయు చూపి ఆదర్శరూపుడగు పతి ఆమెకు స్వర్గసుఖము చేకూర్చును. అందుచేత ఆమె కాతడు ప్రేమమయుడగు దైవ మగును. అట్టివానియం దేకనిష్ఠ సహజముగా కుదురును. పతిప్రేమ నిరాకాంక్షము, నిస్స్వార్థము, ఏకనిష్ఠము, గౌరవపూర్ణము కావున ఆమె తనప్రేమను కూడా అట్లే యొనరించి పత్యనురక్త యగును. ఇట్టిపతి ఆదర్శపతియని మనువు శాసించెను. వశిష్ఠుడు, మంద పాలుడూ ఇట్టి పతులే. అతినికృష్టమగు కులమునపుట్టిన అక్షమాలను సారింగిని మాన్యులూ సతులు నగు లలనామణులుగా గావించినారు - సత్యవతి మొదలగు నిమ్నజాతి నారీమణులు పతుల గుణసంపదచేత గుణవతులై సతులైరి. స్త్రీల నుద్ధరింప సమకట్టువాళ్ళు వారిమూలముననే తమవంశము, చారిత్రము, ధర్మమును రక్షించుకొందురని మానవధర్మ శాస్త్రమం దున్నది. కులనారులు గుణవతులౌటవల్ల వారి కులము, శీలము, ధర్మమున్నూ ఉద్ధరించడమునకు సందేహములేదు. మహాదేవుడు సతీప్రేమను మెచ్చి దానికి వశుడయ్యె ననుటకు ప్రత్యక్షప్రమాణ మాతడు అర్ధనారీశ్వరుడు కావడమే