పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186 సాహిత్య మీమాంస

రించి ఆర్యదాంపత్యము సంఘటిత మయ్యెను. ఆదర్శదంపతులు ఉమామహేశులు, వారి కవినాభావసంబంధ మేర్పరచబడినది చూడండి -

                  వాగర్థావివ సంపృక్తా..............
                 "జగత:పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ".....కాళిదాసు

ఆర్యబాలికలు తమభర్తలు సదాశివులనీ, సదాశివుడు పార్వతియెడ నెట్టి యాసక్తితో మెలగెనో తమ భర్తలుకూడా తమపై నట్టి అనురాగము చూపవలెననీ కోరుతూ బాల్యమునుండీ శివునారాధిస్తూ "జన్మజన్మాంతరములందు నిన్ను బోలు పతిని సమకూర్చుమని" ప్రార్థింతురు. ఇట్టి కౌమారీ వ్రతమునే కాళిదాసుగౌరికి నిర్మించెను, ఆ గౌరీపూజే ఇప్పటికీ పెళ్ళికూతుళ్ళు వివాహకాలమున చేయుదురు.

పసితనమందే సతీదేవి శివు నర్చించి ప్రసన్నుని చేసుకొని పెళ్ళియాడి సుఖముగా నుండెను, ఆమె మరణించి తిరిగీ సదాశివునే పతిగా బడయవలెనని పార్వతియై కౌమారీవ్రత మాచరించెను, ఈ తపోదృశ్య మతిసుందరము మనోహరమగునట్లు కాళిదాసు వర్ణించెను - పార్వతి శివుని పూజించుటకు కావలసిన పువ్వులు కైలాసగిరిని పూస్తూఉంటే వాటితో తన్నర్చించినందుకు శివుడు సంతసించి తత్పూజాఫలముగా నామెను భార్యగా గైకొనెను.

1. ప్రేమమయుడు (భోలానాధుడు)

ఆర్యనారీమణులకు నిరూపించిన వ్రత మీతపశ్చరణమే. పార్వతి శివునర్చించినతీరుననే సతులందరూ సృష్టికర్త నారాధి