పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

185 దేవత్వము

నిర్మింపబడింది. దివ్యాదర్శములే అవశ్యా నుసరణీయములు, మన యాదర్శము లట్టివే. వీటిలో భవాని యొకర్తె, ఆమె స్త్రీరూపధారిణియగు ప్రకృతి.

పురుషాదర్శ మెట్లు లభించును? ప్రకృతి పురుషులు సృష్టిలోని మూలతత్వములు. పురుషుని సత్త ప్రేమయం దుండును, ప్రేమయే సంసారమునకు మూలభిత్తి; వ్యక్తులు కలియుటకూ వేరగుటకూ ప్రేమ ప్రధానకారణము. పురుషుని ప్రేమమయమూర్తే ప్రకృతి. ప్రకృతి పురుషు లనాదినుండీ పరస్పరాసక్తులు, వారిద్దరికీ సత్త ఒకటే. ప్రకృతి పురుషు నాశ్రయించుటచేతనే అతనికి విశ్వేశ్వరుడనీ ఆమెకు విశ్వేశ్వరి అనీ పేర్లు వచ్చినవి. ఆతడు ప్రకృతిలో చొచ్చి విలాసార్థము విశ్వమంతా సృజించి రక్షించి ధ్వంసము చేయుచుండును. విశ్వమే లేకుంటే ప్రకృతిపురుషులకు నెలవేదీ? ఈలోకమంతా మాయామయము. విశ్వప్రకృతి మహామాయ, ఆమె పురుషుని ప్రేమాధీనయై యుండును. సతి పతిని విడుచునా? ఆమె కతడే సర్వస్వము, ఏకాశ్రయము. ఆమె కాతనితోటే సంసారము, ఆతని పరిచర్యయే ప్రధానలక్ష్యము. ఆతనియెడ నామె యాసక్తి రూఢము, ఎప్పుడు నుండు పదార్థము సత్, దాని నాశ్రయించి యుండునది సతి.

ఆదర్శరూపుడగు పతి

పైనివివరించిన సతి ఆర్యుల కాదర్శరూపుణియైన సతి, ఆమె భర్త ఆదర్శరూపుడగు పతి. ఆ జగత్పితరుల ననుక