పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184 సాహిత్య మీమాంస

                పతులు వచ్చిన నాసనపాద్యవిధుల భక్తితో నేన కావింతు పనుప నొరుల||

            4. అత్తకుభక్తిగల్గి మది నాయమ సెప్పినమాడ్కి చేటికా
                వృత్తము లాచరింతు గురువిప్రసురాతిథిపూజనంబు ల
                త్యుత్తమభక్తి నేన తగనోపి యొనర్తు ప్రియంబు తాల్మియున్
                మెత్త దనంబు సంతతము మేలుగ దాల్తు సమస్త భంగులన్||
                .............సకలభృత్యజనంబుల జీవితంబుల నరసి వేన నడుపుదును,
                
                పాండునందనులు తమకుటుంబభారంబు సర్వంబును నాయంద నిల్పి వారు నిర్భరులై యిష్టవిహారంబుల నుందురు. రే నెల్ల వెంట నప్రమత్తనై వర్తింతును.
   
            6. పతి గడవంగ దైవతము భామల కెందునులేదు ప్రీతుడై
                పతి కరుణించెనేని కులభామిని భాసురభూషణాంబరా
                న్వితధనధాన్యగౌరవము విశ్రుతసంతతియున్ యశంబు స
                ద్గతియును గల్గు నొండుమెయి గల్గునె యిన్ని తెరంగు లారయన్||

ద్రౌపది గృహకృత్యములందు అత్యంతధీరయు, వ్యవహారమున అత్యంతనమ్రయు, అభ్యర్థనమున సంభాషణయందున్నూ వినయవతియు వంటింట దమయంతియు, అతిథిసంతర్పణమున అన్నపూర్ణగానూ వర్తించడము చూచి చాల అచ్చెరు వొంది సత్యభామ "ఆహా! ఈమె సాక్షాల్లక్ష్మి, దశభుజయగు లోకమాత" అని నుతించి పతివశీకరణమంత్రమూ ఔషధమున్నూ కన్నులారగాంచి సంతసించి ద్వారక కేగెను.

ఆదర్శ దంపతులు.

ఆర్యసాహిత్యమున సత్యాదర్శము చిత్రించినట్లే కవులు పత్యాదర్శనమును కూడా నిరూపించినారు. అనాదినుండీ పత్యనురక్తలగు ఆర్యసతీమణుల చరితము ననుసరించి సత్యాదర్శము