పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

183 దేవత్వము

పంచపాండవు లొకరొకరికంటె ద్రౌపదియందు అనురక్తులౌట అత్యద్భుతమని యెంచి సత్యభామ ద్రౌపది నిట్లడిగెను. నగుమొగంబులేకాని నాతీ, నీదెస నెప్పుడూ పతులకు కిన్క లేదు. ఇది -

                  *వ్రతము పెంపొమంత్రౌషధవైభవంబొ సరస నైపథ్యకర్మకౌశలమొ చతుర
                   విభ్రమోల్లాసరేఖయొ వెలది నీ విశేషభాగ్య హేతువు సెపుమ నాకు.

అనేటప్పటికి ద్రౌపదికి వచ్చినకోపము నడచుకొని యిట్లనెను : _

               1. అలయక మంత్ర తంత్ర వివిదౌషధభంగుల జేసి ఎంతయుం
                  వలతురు నాథులంట మగువా కడు బేలతనంబు, దానమున్
                  గలిగిన ప్రేమయుం బొలియు, గాని యొకండును సిద్ధిబొంద, ద
                  ప్పొలతులతోడి మన్కి అహిపొత్తుగ చూచు విభుం డెరింగినన్
                  పాండవులయెడ నే నెట్టిదాననై యిట్టి సౌభాగ్యంబు నందితినో

అది నీ కెరిగించెద వినుము : _

              2. పతులకు నెప్పుడు కావింపందగదు కపటకర్మంబులు త
                  ద్భావ మెరిగి వశవర్తినియై వనిత చరింపనదియయగు నెల్లవియున్||

              3. పతులాత్మ నొండొక పడతులగలిసిన, నలుగ నెయ్యడలనహంకరింప
                  మదముప్రమాదంబు మాని వారికిచిత్త, మేక ముఖంబుగ నెల్లప్రొద్దు
                  భక్తి సేయుదు, చూపు పలుకులు కోర్కెయు జెయ్వులు వింతగా చేయ సెపుడు.
                  అమరగంధర్వయక్షాదులందైనను, బురుషు నన్యుని తృణంబుగదలంతు
                  స్నానభోజనశయనాదిసంప్రయోగమర్థి పతులకుమున్నెందునాచరింప