పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

181 దేవత్వము

                "....................................................................దయావిహీనతన్
                 చేసినకర్మముల్ ఫలము జెందునె? కర్మము లెన్నియేనియున్
                 చేసినవాని సద్గతియె చేకురు భూతదయార్ద్రబుద్ధినో......"
                                           ...............................అ|| పెద్దన్న

మొట్టమొదట సంసారమున సంకీర్ణభావమున బయలు దేరిన ప్రేమ క్రమముగా విశ్వవ్యాప్త మవుతుంది. విశ్వవ్యాప్తమైన ప్రేమను "మైత్రి" అంటాము, దాని నభ్యసించిన సతీమణి పతివెంట దుర్గమారణ్యముకైనా ప్రయాణముచేయ సిద్ధపడుతుంది. యాజ్ఞవల్క్యుని భార్యలలో మైత్రేయి మాత్రమే ఇట్టి ఉదారప్రేమపథగామిని అయింది. కావుననే ఆత్మజ్ఞానము పొంద నామె కహన్‌త కద్దని యెంచి - "నీవు నీపతిని ప్రేమించుచున్నంత మాత్రాన అతడు నీకు ప్రేమ పాత్రముకాడు, నీ వాత్మను ప్రేమిస్తూన్నావు కావుననే నీపతి నీకు ప్రేమాస్పదు డవుచున్నాడు: ధనమును నీవు వలచుచున్న హేతువుచేత అది నీకు ప్రియము కాదు; నీ వాత్మను ప్రేమించుటచేతనే ధనము నీకు ప్రేమపాత్ర మగుచున్నది; నీపుత్రుని నీవు ప్రేమించడముచేత వాడు నీకు ప్రేమస్థానము కాడు, నీ వాత్మను ప్రేమిస్తున్నావు కనుక వాడు నీకు ప్రియతము డవుచున్నాడని: *[1] యాజ్ఞవల్క్యుడు ఆమెకు బోధించెను.

  1. * వ్యక్తమైన ప్రతిపదార్థమందున్నూ అవ్యక్తమైన ఆత్మ నిహితమై యున్నదనిన్నీ, "ఏకమే నాద్వితీయ"మ్మని మనమెరిగి ప్రేమించవలసిన పదార్థ మదే అనియు, ప్రతివస్తువునకు సత్తా దానివల్లనే కలుగుననియు, వస్తువునందు మనకుగల ప్రేమ ఆత్మయందు నిహిత మొనర్చవలెననియు ఋషి అభిప్రాయము.