పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180 సాహిత్య మీమాంస

చేస్తూ దేవతలను భక్తితో నారాధించుతూ ఉన్న బాలకు పాతివ్రత్యపాలన మొకలెక్కా ? బాల్యమునుండీ భక్తి శ్రద్ధలం దారితేరినవాళ్ళు వయోవృద్ధి నొందినకొద్దీ వాటిని పెంపొందించగలరు; బంధువులయెడ వాళ్ళుచూపే అనురాగమూ ప్రేమయున్నూ అట్లే దినదినాభివృద్ధి నొందును.

వేదశాస్త్రజ్ఞానము లభించినివారికి భక్తే ఉత్తమ మార్గమూ ప్రధానవిద్య తపస్సు నగును. బాలిక బాల్యావస్థ యందే పత్యా రాధనము నేర్చుకొనును. అశిక్షితులైనవాళ్ళకు ప్రత్యక్షదైవమే అధికతమభక్తి పాత్రము. ప్రత్యక్షదేవతారాధనము భగవదారాధనముకు తొలిమెట్టు; భక్తిమార్గ మవలంబించేవాళ్ళు స్థూలదేవతలనే మొదట పూజింతురు, తరువాత అది సూక్ష్మదేవతారాధనముగా పరిణమించుతుంది; ఇందుకే పతిప్రేమ పెంపొంది జగత్పతిప్రేమ అవుతుందని చెప్పితిమి! జగత్పతిప్రేమ పూర్ణమై విస్తృతముకాగానే విశ్వవ్యాపి యగును. క్షాంతి, దానము, ధర్మము మొదలైనవాటి చేత ప్రాశస్త్యము పొంది నారీప్రేమ ప్రకటిత మవుతుంది. అతిథులు, అభ్యాగతులు భగవద్రూపులని యెంచి వారిని సత్కరించుటవల్ల ఔదార్యము హెచ్చును. పతియందలి అనురాగము భగవత్సృష్టమైన జంతుజాలమున ప్రసరించును. జీవులయెడ దయజూపకున్న అనగా భూతదయ లేకుంటే భగవత్పూజ సార్ధకముకాదు. చూడండి : _