పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

179 దేవత్వము

కేవల సహాయములు (auxiliaries), మానవులు సచ్చరిత్రులు కావడమే విద్యయొక్క ముఖ్యోద్దేశము.

మైత్రి

సతీధర్మమే స్త్రీల కుత్కృష్టాదర్శము, కావున సతీత్వ నిర్వహణమునకు సాధనమగు విద్యయే వాళ్ళకి నేర్పేవారు. ఇదిగాక ఉత్తమఫల మింకొకటుంటే దానికి తగిన విద్య నేర్పియుందురు. బాలులకు గురుకులవాస విద్యాప్రణాళి విధి బద్ధము చేసినట్లే మనువు స్త్రీశిక్షాప్రణాళిని కూడా నిర్ణయించి యుండును. సీత మన కాదర్శసతీమణి కదా? అయోధ్య నామె ప్రవేశించునప్పటికి పుట్టింటిచదువు పూర్తియై యుండును. ఆవిద్యాక్రమము వాల్మీకి వర్ణింపలేదు, కాని తద్ద్వారా ఆమె కలవడిన గుణసంచయమునుబట్టి ఆమెకు నేర్పిన విద్యావిశేషమును మన మూహించవచ్చును. పుట్టింట రాజర్షియైన జనకమహారాజుయొక్క సాంసారికవ్యవస్థకు తగిన శిక్ష ఆమె కబ్బియుండును. అచ్చట సుశీలలగు సతుల దృష్టాంతముల నామె చూచియుండవలెను. వ్రతములు, నియమములు, పాతివ్రత్యము, సంయమము, గురుభక్తి, దైవభక్తియూ చిన్నతనమునుండీ ఆమె నేర్చియుండును. ఇట్టిభక్తితోనే పతి తన జీవనసర్వస్వమని భావించియుండును. భక్త్యావేశమున ఏకనిష్ఠ, నిస్స్వార్థత, నిరాకాంక్షయున్నూ కలదై పతిసేవ చేయగల్గు సతీమణి అట్టి భావములతో భగవంతుని కొలువ గలదన్న వింతా? పసితనమునుండీ గురువులకు శుశ్రూష