పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178 సాహిత్య మీమాంస

కాక క్రమముగా పెరుగుతూ ఉండును. ఇట్టి పయోముఖ విషకుంభమునుంచి వెలువడే మార్గము మనఋషులు చూపినారు; అదే నివృత్తిమార్గము. ప్రవృత్తివేగమును అరికట్టడము వల్లనే సంసార గతిరోధము ఘటిల్లును. ఇది సంభవమా? సంసారాంబుధిలో లోతుగా మునిగినవారికిన్నీ విషయసుఖములను నాచులో చిక్కుకొన్నవారికిన్నీ ఇది అసంభవము - కనుకనే మనము కూడా అట్టి లోతైన గోతులలో కూరిపోకుండా ఏదైనా ఆసరా దొరకబుచ్చుకోకుంటే కృతార్థుల మగుట సున్న. పూర్వోక్తశిక్షాప్రభావ మనే ప్రాపు దొరకొన్న వాళ్లు సంసృతిప్రవాహమున కెదు రీదగలరు. యోగ్యమైన విద్యకు ఫలములు మూడు: _ అరిషడ్వర్గము లొంగదీయుట, యౌవనోన్మాదము నరికట్టుట, భగవంతు నారాధించుట - బాలికల కిట్టి చిత్తశుద్ధి కల్గడమునకే సతీత్వాదర్శమూ శిక్షావ్రతమూ కల్పింపబడినవి; బాలకులు గురుకులమున శుశ్రూషచేస్తూ వేదాధ్యయనము, శాస్త్రపఠనము చేసేటప్పుడు నివృత్తిమార్గ చోదకములైన శమదమాదిగుణగణము *[1]నభ్యసించకతప్పదు. అధ్యయనము, శాస్త్రపఠనమున్నూ క్రమమైనశిక్షకు

  1.              *Tis beauty that doth oft make women proud;
                   Tis virtue that doth make them most-admired;
                   Tis government that makes them seem divine.
                                                     ... ... ... Shak

                   స్త్రీల తరుచుగ గర్వింప జేసెడునది
                   సొగసు, వారల మిక్కిలి పొగడబడగ
                   సలుపునది సద్గుణంబు, వేల్పులుగవారు
                   తెలియబడజేయునది జితేంద్రియత చూవె.
                                                    అ|| నా|| దా||