పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

177 దేవత్వము

గుణములు గురు వేలాగు నేర్పునో, ఆలాగే అబోధలగు బాలికలను అహన్‌రీతిని శాసించి గృహిణీధర్మములు అత్తింటి పెద్దలు నేర్పుతూండేవారు. ఇట్టిశిక్ష స్వగృహమున కొనసాగక పోవడము చేతనే మనసంఘమున పైనుదహరించిన వ్యవస్థ యేర్పడింది - దానివల్ల బాలికాబాలకులు సుశిక్షితులై సంసార సంబంధములగు పనిపాట్లలో నిపుణులై సుఖముగా జీవించు చుండిరి - వీరు గృహస్థులుగా పెరిగి నప్పుడు తమబిడ్డల కిట్టిశిక్షే యొసంగుతూ సంసారవృక్షమును నలువైపులా వ్యాపింపచేసి తత్ఫలముల ననుభవించుచుండేవారు - మనవాళ్ళు తమ మానుషత్వము నభివృద్ధిచేసుకొని స్త్రీపురుషులయందు దానిని పెంపొందించి సంసారముల నేలాగు సాగిస్తూ ఉండిరో, ప్రమచేతను స్నేహముచేతనూ అందరి నెట్లు ప్రసన్నుల చేయగల్గినారో దానికి ప్రత్యక్షనిదర్శనములును మనగ్రంథములలో చూడవచ్చును.

సంసారాశ్రమములు ప్రవృత్తిమార్గమునకు విస్తృత క్షేత్రములు. తద్ఘోర లహరులయందు నిరాటంకముగా కొట్టుకొనిపోయేవాళ్ళు ఆ తరంగములయందు మునుగుతూ తేలుతూ, కాలవశమున పోటుదెబ్బలు తింటూ, ఆ ప్రవృత్తి స్రోతమున ఒక సంసారతరంగము నుంచి ఇంకొక తరంగమునకు కొట్టుకొనిపోయి, జన్మజన్మాంతరములా వాత్యాచక్రమున తిరుగుతూ ఉందురు. సంసారమందలి సుఖదు:ఖములే వారికి భోగభాగ్యములు. ఆసుఖ మెంతహెచ్చినా దు:ఖము దూరము