పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

171 వీరత్వము

దీని ఫలితార్థమేమి? ఆర్యవీరుల కెట్టి విద్య గరపబడెనో దీనివల్ల వ్యక్తమైనదా? వారికి నేర్పేది కేవలాస్త్రశస్త్రచాతుర్యమే కాదు, అంతతో ముగిస్తే ఆభ్యంతరిక తపోబలము వారి కలవడదు, వారు జితేంద్రియులు కాలేరు. విద్య నభ్యసించునపుడు వారి భుజబల మభివృద్ధి చెందినట్లే ప్రేమ, భక్తి, శ్రద్ధ, అనుశీలము కూడా అభివృద్ధి నొందవలెను. బాహ్య శత్రువుల జయించుటకు వా రస్త్రవిద్యయం దారి తేరినట్లే అంతశ్శత్రువుల జయించు సామర్థ్యముకూడా వారు సంపాదించు చుండిరి. అస్త్రబలమున యుద్ధకౌశలమునందున్నూ అసురులను సంహరించుట నేర్చుకొన్నట్లే వారు శమాదిషట్కసంపదచేత కామాదుల జయింప నేర్చియుండిరి. ఈరెండు తెరగుల విజయము పొందగలిగిన వీరుడే నిజమైన వీరుడని గణింపబడుచుండెను. బాహ్యశత్రువులను మాత్రమే జయింపగల్గి అంతశ్శత్రువుల నదుమలేనివారికి సుఖమూ లేదు శాంతీ యుండదు. పృథ్వియంతా చేజిక్కినా వారి దు:ఖము తొలగదు, చిత్తములకు శాంతి చేకూరదు.

వీరుల సంపద

అంతరంగసమరమున విజయమొంది చిత్తమునకుశాంతి చేకూర్చుకొనువానికి పృథ్వీతలమంతా వశమైనట్లే. అతడు కోరదగు కోర్కెలుండవు - దేవేంద్రుని సింహాసనము, కుబేరుని నవనిధులూ అతనికి కరగతమగును. నిస్స్పృహావిష్టుడగు నాతని చిత్తమున మోహమూ లోభమూ పుట్టించ దగు