పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

169 వీరత్వము

పృథ్వినంతా మ్రింగజూచునప్పుడు, కామము అనింద్యచరిత్ర యగు సతీమణిని చెరపజూచునప్పుడు, దర్పము దశదిశల ప్రజ్వరిల్లునప్పుడు, క్రోధము ప్రపంచమునెల్ల కంపింపజేసి రక్తసంసిక్తము చేయనెంచునప్పుడున్నూ - ఆతని వీరత్వము "పాశవ" మనబడును. ఉ|| రావణుడు, దుర్యోధనుడు.

సద్గుణరాశిచేత వీరత్వమును సాధించి మానవుడు విశ్వప్రేమచేతనూ దయచేతనూ దానవీరుడై, బలిచక్రవర్తివలె పృథ్వినంతా ఒరులకిచ్చినా తృప్తిలేక, రఘుమహారాజువలె తన నిధులనన్నిటిని యాచకులకు పంచియిచ్చినప్పుడున్నూ, యుధిష్ఠిరునివలె దానమందు, దయయందు, ధర్మమందున్నూ, పరమావధి చేరునప్పుడున్నూ, ద్రౌపదివలె పుత్రహంతనైన క్షమించునప్పుడున్నూ, ఆశ్రితులయెడ శిబివలె త్రాణపరాయణత కన్పరుచునప్పుడూ, భీష్మునిలాగు యావజ్జీవబ్రహ్మచర్య మాచరించునప్పుడున్నూ, స్వధర్మజ్ఞానముచే ఉదారుడై సుయోధనుని రీతి తనసర్వస్వము నితరుల కర్పింపబూనునప్పుడున్నూ, కర్ణునివలె శత్రువునకైనా తన జీవనసర్వస్వము ధారపోయునప్పుడున్నూ "దివ్యవీరత్వము" కనబడును.

మానవుడు సత్యవాక్పాలనా నిరూఢప్రతిజ్ఞుడై, స్వధర్మము, కులము, మానము, మర్యాదయు నిల్పుకొనుటకు రిపుకులమును రూపుమాపి, ధర్మసంస్థాపనార్థము ధరిత్రీ భారము తగ్గింపబూని, ఋషులు మొదలగు శిష్టుల పీడల తొలగించుటకు దుష్టుల శిక్షించి, ప్రజానురంజనమునకై