పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168 సాహిత్య మీమాంస

కృతార్థు డాయెను. ఇట్టి ఉదాహరణము లెన్నో కలవు.

మహాకావ్యములయందలి వీరత్వము

ఆర్యసాహిత్యమున నన్ని తెరగుల వీరత్వాదర్శము లున్నవని రామాయణ భారతములు చదివినా రెరుగగలరు. ఈచిత్రములను వేర్వేర వివరించిన నొక్కొక్కగ్రంథ మగును. వాటికి వ్యాఖ్యాన మొనర్చుట కీచిన్నపుస్తకము చాలదు. ఒక్కభారతమందే ఇవి కుప్పలుగా నున్నవి. మన వాఙ్మయమున ప్రేమమాధుర్య మున్నట్లే వీరత్వమందలి తేజుస్నూ కలదు. సరస్వతీనదివలె ప్రేమ శాంతరూపమున ప్రవహింప, వీర్యతరుంగిణి బ్రహ్మపుత్రానదివలె గర్జిస్తూ ప్రవహించును. కాళిదాసూ భవభూతిన్నీ ప్రేమలహరుల ప్రవహింప జేయ వాల్మీకీ వ్యాసులూ వీరప్రవాహముల నతివేగమున పారించి ఉత్తాళతరంగముల జనింపజేసినారు. కురుక్షేత్ర సంగ్రామమున వీరరసమందలి ఉన్మత్తత స్పష్టపడి ఓజస్విని యైన భాషచే ఆ రసము చిప్పిలజేసి సమగ్రభరతఖండమునందు ముంచెను.

మూడు రకముల వీర్యము

ప్రేమకున్న మూడుగతులూ బీరమునకు గూడా ఉన్నవి. మానవునియం దప్పుడప్పుడు పాశవవీరత, ఉన్మాదమూ కనబడుచుండును, ఒకప్పుడు దివ్యవీరత్వమూ మరొకప్పుడు మానవవీరతయు ప్రకాశించుచుండును.

మానవుని షడ్రిపువర్గము అత్యంతప్రబలమై - లోభము