పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

167 వీరత్వము

పరీక్షింప బడెను, ఆత డుత్తీర్ణుడై సత్యవాక్పాలనాజయఘోషము చెలగజేసెను.

రక్తపాతములేని బ్రాహ్మణప్రతిజ్ఞాపాలనము

గురుదక్షిణ అర్పించుటకు బ్రాహ్మణులు పలుబాముల పడవలసివచ్చింది. బ్రహ్మచర్య మాచరించుతూ విద్యాభ్యాసమొనర్చునపుడు శిష్యుని కెట్టిధైర్యము, ఎట్టి సంయమము, తితిక్ష అలవడ్డవో పరీక్షించుటకు పూర్వకాల మందలి గురువులు దుస్సాధ్యమైన గురుదక్షిణ కోరుచుండేవారు. తపోధనుడగు ఉతంకుడు గురుదక్షిణ నిచ్చుటకు గౌతమ మహర్షి ఆజ్ఞానుసారము అహల్య చెంతకేగెను. ఆమె ముందు వెన్క లారయక సౌదాముడను రాజు పట్టపురాణి కర్ణకుండలద్వయమును తెచ్చి యిమ్మనెను. తదాజ్ఞానుసారము ఉతంకుడు ఎట్టికష్టములకు లోనయ్యెనో మహాభారతమున అశ్వమేధపర్వమున విశదముగా వర్ణింపబడినది. అబోధుడగు ఆబ్రాహ్మణవటువు గౌతమమహర్షి కృపచేతనూ తన తపోబలముచేతను వసిష్ఠుని శాపవశమున రాక్షసిరూపము ధరించిన ఆమహారాణి కర్ణకుండలముల నతికష్టమున సంపాదించి గురువుగారి ఆశ్రమమునకు తిరిగి వచ్చుచుండ ఆకుండలముల నొకపాము నాగలోకమునకు ఎత్తుకొనిపోయెను. ఆతడు ధైర్యము విడువక వాటిని తిరిగి సంపాదించి అహల్య కర్పించెను. గురుకులమున నాత డభ్యసించిన ఆంతరికబలము తత్కఠినకార్యనిర్వహణమున వినియోగపడుటచేత అతడు